ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రమాదవశాత్తు చేయి కోల్పోయిన యువకుడికి సహాయం - ఆత్మకూరు నేటి వార్తలు

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఐక్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. ఓ యువకుడికి ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదంలో చేయి కోల్పోయిన అతడికి.. వైద్యం నిమిత్తం ఈ సాయం చేశారు.

money distribution to victim in athmakooru nellore district
ప్రమాదవశాత్తు చెయ్యి కోల్పోయిన యువకుడికి ఆర్థిక సహాయం అందజేత

By

Published : Oct 19, 2020, 4:32 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఏసీఎస్ఆర్ కాలనీకి చెందిన సుధీర్... ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఎడమ చేయి కోల్పోయాడు. మెరుగైన వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేకపోవడంతో... కుటుంబ సభ్యులు ఐక్య ఫౌండేషన్​ను ఆశ్రయించారు. స్పందించిన సంస్థ వ్యవస్థాపకుడు పయ్యావుల రామకృష్ణ చౌదరి... దాతల సహాయంతో రూ.36,500 అందించారు.

ఈ కార్యక్రమానికి ఆత్మకూరు బ్రేక్ ఇన్స్​పెక్టర్ అజాద్ జాకీర్, ఎంపీడీవో రాఘవేంద్ర పాల్గొన్నారు. ఆపదలో ఉన్న వారికి ఐక్య ఫౌండేషన్ అండగా నిలుస్తోందని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆత్మకూరు బ్రేక్ ఇన్స్పెక్టర్ జాకీర్ అన్నారు. సుధీర్​కు మెరుగైన వైద్యం అందించేందుకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఎంపీడీఓ ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details