నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి... రైతులకు చేయూతనందించారు. విడవలూరు మండలం ఊటుకూరు పెద్దపాలెంలో ఇటీవల కరెంట్ షాక్కు గురై 13 గేదెలు మృతి చెందాయి. నష్టపోయిన రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే ఆర్థిక సహాయం చేస్తానని వారికి అప్పట్లోనే హామీ ఇచ్చారు.
ఈ మేరకు నెల్లూరు నగరంలోని ఎమ్మెల్యే నివాసంలో నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రెడ్డి ట్రస్ట్ ద్వారా లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని రైతులకు అందించారు. అదే విధంగా శంభునిపాళెం గ్రామంలో నూతన అరుగు నిర్మాణానికి 50వేల రూపాయల సహాయం అందించారు.