ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మీ సేవలు మాకొద్దు'.. ఏఎస్సై ఫోన్ లాక్కున్న ఎమ్మెల్యే అనుచరులు - మీ సేవలు మాకొద్దు.. ఏఎస్సై ఫోన్ లాక్కున్న ఎమ్మెల్యే !

నెల్లూరు జిల్లాలో వైకాపా ఎమ్మెల్యే రంజాన్ తోఫా సరకులను పంపిణీ చేస్తున్నారు. ఈ దృశ్యాలను తన ఫోన్​లో వీడియో తీస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై దగ్గరి నుంచి ఎమ్మెల్యే అనుచరులు ఫోన్ లాక్కున్నారు. మీ సేవలు మాకు అవసరం లేదు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ఏఎస్సైను ఎమ్మెల్యే హెచ్చరించారు.

mla prasanna in nellor
mla prasanna in nellor

By

Published : May 15, 2020, 6:05 PM IST

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై ఫోన్​ను వైకాపా నాయకులు లాక్కోవడం కలకలం రేపింది. బుచ్చిరెడ్డిపాలెంలో రంజాన్ తోఫా సరకులను ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని తన చరవాణిలో చిత్రీకరిస్తున్న స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై నుంచి వైకాపా నాయకులు ఫోన్ లాక్కుని.. ఎమ్మెల్యే వద్దకు తీసుకువెళ్లారు. 'మీ సేవలు మాకు అవసరం లేదు... ఇక్కడి నుంచి వెళ్లిపోండి' అని ఎమ్మెల్యే ఏఎస్సైను హెచ్చరించారు.

కొంత సమయం తరువాత ఏఎస్సైకి చరవాణిని తిరిగి ఇచ్చేశారు. నిన్న జరిగిన సంఘటనను కొందరు చరవాణిలో చిత్రీకరించారు.

ఇదీ చదవండి:రుతుపవనాలు ఈసారి 4 రోజులు ఆలస్యం

ABOUT THE AUTHOR

...view details