గంగా కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే ఆందోళన నెల్లూరులో గంగా కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ నిరసన చేశారు. గూడూరు నియోజకవర్గానికి తాగునీరు విడుదల చేయాలనిడిమాండ్ చేశారు. తాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.నియోజకవర్గం మొత్తం 150 చెరువుల్లోని పదకొండింటికే 0.7 టీఎంసీల నీటిని విడుదల చేశారని ఆరోపించారు. అధికారులు హామీతో ఆందోళన విరమించారు. బుధవారంలోగా నీటిని విడుదల చేయకుంటే..ఆమరణ నిరాహార దీక్ష చేస్తాననిహెచ్చరించారు.