ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీటి ప్రవాహంలో చిక్కుకున్న కోవూరు ఎమ్మెల్యే - latest news in vidavalluru

ముంపు ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లిన కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. స్థానిక మత్స్యకారులు అతి కష్టం మీద ఎమ్మెల్యేను ఒడ్డుకు చేర్చారు.

MLA Nallapureddy Prasannakumar Reddy
నీటి ప్రవాహాంలో చిక్కుకున్న ఎమ్మెల్యే

By

Published : Nov 29, 2020, 8:18 AM IST

ముంపు ప్రాంతాన్ని పర్యవేక్షించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ఊటుకురు, పల్లిపాలెం లోతట్టు ప్రదేశాలను సందర్శించేందుకు ఎమ్మెల్యే బోటులో వెళ్లారు. ప్రవాహం అధికంగా ఉండటంతో కొంతసేపు హడావుడి నెలకొంది. దీంతో వైసీపీ నేతలు, అధికారులు ఆందోళన చెందారు. స్థానిక మత్స్యకారులు కష్టం మీద ఎమ్మెల్యేను ఒడ్డుకు చేర్చారు.

ABOUT THE AUTHOR

...view details