ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుండె జబ్బుతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం - MLA nallapureddy prasanna kumar reddy helping to six month old baby latest news update

ఆరు నెలల చిన్నారి వైద్యానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేయూతనందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడిన ఎమ్మెల్యే.. గుండె సంబంధిత వైద్యులతో సంప్రదించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపరేషన్ చేయిస్తామని వారికి భరోసా ఇచ్చారు.

చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం
చిన్నారి వైద్యానికి ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

By

Published : May 18, 2021, 4:37 PM IST


నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం వడ్డి పాలెం గ్రామంలో చిన్నారి వైద్యానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేయూతనందించారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆరు నెలల చిన్నారి షణ్ముఖ అభిరామ్ వైద్యానికి.. 2 లక్షలు ఆర్ధిక సాయం ప్రకటించారు. బాలుడి నివాసానికి వెళ్లిన ఎమ్మెల్యే బాలుడి బతల్లిదండ్రులను అడిగి.. చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి ట్రస్ట్ తరపున ఈ ఆర్ధిక సహాయం చేయనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గుండె సంబంధిత వైద్యులతో సంప్రదించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆపరేషన్ చేయిస్తామని వారికి భరోసా ఇచ్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details