వనమహోత్సవం, జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గంగిరెడ్డి పల్లిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి మొక్కలు నాటారు. వర్షాలు పుష్కలంగా కురవాలంటే విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఉదయగిరి నియోజకవర్గ అభివృద్ధి పై తాను ముఖ్యమంత్రిని కలిసి చర్చించగా ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. వెలిగొండ ప్రాజెక్టు, సీతారాం సాగర్, రోడ్లు, ఇరిగేషన్ పరంగా చేయాల్సిన అభివృద్ధి విషయాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆర్థికంగా బలోపేతమై సుఖ జీవనం సాగించే పద్ధతిలో సీఎం పరిపాలన చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు ఆయనకు మరింత అండదండలు నందించి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ రేంజ్ అధికారి ఉమా మహేశ్వర్రెడ్డి, ఎంపీడీవో వీరాస్వామి, ఉపాధిహామీ సిబ్బంది, వైకాపా నాయకులు పాల్గొన్నారు.
ఉదయగిరిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మేకపాటి - ఉదయగిరిలో వనమహోత్సవం వార్తలు
రాబోయే రోజుల్లో నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది సస్యశ్యామలం అవుతుందని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. వనమహోత్సవం, జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో భాగంగా గంగిరెడ్డి పల్లిలో ఆయన మొక్కలు నాటారు.

ఉదయగిరిలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే మేకపాటి