ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలినేని తరహాలోనే.. నాకు ఇంటిపోరు తప్పడం లేదు: శ్రీధర్‌రెడ్డి - ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి వార్తలు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటిపోరు తప్పడం లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. వాపోయారు. నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు.

శ్రీధర్‌రెడ్డి
శ్రీధర్‌రెడ్డి

By

Published : Jun 28, 2022, 3:39 PM IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తరహాలోనే తనకూ ఇంటి పోరు తప్పట్లేదని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి వాపోయారు. జిల్లాకు చెందిన వైకాపా ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో కాకుండా తన నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. ఈ విషయంలో తెదేపా, జనసేన చేస్తున్న వ్యాఖ్యలను శ్రీధర్ రెడ్డి ఖండించారు.

బాలినేని తరహాలోనే.. నాకు ఇంటిపోరు తప్పడం లేదు: శ్రీధర్‌రెడ్డి

‘బాలినేని మూడు జిల్లాలకు ఇన్‌ఛార్జి. పార్టీలో కీలక నేత. అంతటి వ్యక్తికి స్థానిక నాయకులు అండగా ఉండాలిగానీ సమస్యగా మారకూడదు. ఆయన ఆవేదన చాలా బాధ కలిగించింది. బాలినేని ఆత్మస్థైర్యం దెబ్బతినేలా పార్టీ నేతలు ఎవరూ ప్రవర్తించకూడదు. నెల్లూరులో నేనూ అలాంటి సమస్యే ఎదుర్కొంటున్నాను. కొంత మంది పార్టీ ముఖ్యనేతలు వారి నియోజకవర్గాల్లో మరోసారి ఎలా గెలవాలో ఆలోచించకుండా ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. ఇది పార్టీకి మంచిది కాదు. - శ్రీధర్‌రెడ్డి , నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details