వెంకటాచలం ఎంపీడీవో సరళపై దౌర్జన్యం చేసిన కేసులో అరెస్టు అయిన ఎమ్మెల్యే కోటంరెడ్డి మీడియాతో మాట్లాడారు. అనుమతులున్న తన మిత్రుడి లేఅవుట్‌కు వాటర్ కనెక్షన్ అడిగితే ఇవ్వలేదని.. దీనిపై ఎంపీడీవోను అడిగినట్లు కోటంరెడ్డి తెలిపారు. సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇవ్వొద్దని.. ఎంపీడీవో సరళ చెప్పినట్లు కోటంరెడ్డి వెల్లడించారు. కోర్టుకు వెళ్లాలని తన మిత్రులకు సూచించినట్లు పేర్కొన్నారు. ఎంపీడీవో ఇంటికి వెళ్లి ఎలాంటి దౌర్జన్యం చేయలేదన్నారు. ఆధారాలు ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ చెప్పడం అభినందనీయమన్నారు. అయితే ముఖ్యమంత్రి ఇచ్చిన స్వేచ్ఛను నెల్లూరు జిల్లా ఎస్పీ తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఉన్నత స్థాయి కమిటీ వేసి నిజానిజాలు తెలుసుకోవాలన్నారు. తనది తప్పని రుజువైతే.. పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరించాలన్నారు.
కావాలనే కేసులో ఇరికించారు:కోటంరెడ్డి - sridhar reddy version on mpdo sarala case 2019
వెంకటాచలం ఎంపీడీవో ఆరోపణలపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను చూసి భరించలేక ఉద్దేశపూర్వకంగా తనపై కేసులు పెట్టించి ఇరికించారన్నారు.
తప్పు నాదైతే....పార్టీనుంచి బహిష్కరించండి