నెల్లూరు జిల్లా నాయుడుపేట కొవిడ్ కేంద్రంలో వైద్య సిబ్బందిని నియమించడంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు విఫలమవుతున్నారని.. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయుడుపేట కొవిడ్ కేంద్రంలో స్థానిక శ్రీ సిటీ నిర్వాహకులు రవిరెడ్డి సన్నారెడ్డి అందించిన ఆక్సిజన్ సిలిండర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం రోగులతో మాట్లాడి, కేంద్రంలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. నియోజకవర్గ ప్రజల అవసరాల దృష్ట్యా.. కొవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామన్న సంజీవయ్య.. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు.
కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాలపై ఎమ్మెల్యే సంజీవయ్య అసంతృప్తి - naidupeta latest news
నెల్లూరు జిల్లా నాయుడుపేట కొవిడ్ కేర్ కేంద్రానికి ఓ దాత అందించిన ఆక్సిజన్ సిలిండర్లను స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రారంభించారు. అనంతరం కేంద్రాన్ని పరిశీలించిన ఆయన.. కరోనా బాధితులకు అందుతున్న సౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నాయుడుపేట కొవిడ్ కేంద్రం