సభ్యసమాజం సిగ్గుపడేలా ఓ దివ్యాంగ మహిళపై దాడి జరిగిందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని టూరిజం హోటల్‌కి వెళ్లి ఉషారాణిని ఆయన పరామర్శించారు. బాధితురాలికి అన్ని విధాలా అండగా ఉంటామని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తోందని, నిందితుడైన డిప్యూటీ మేనేజర్ భాస్కర్ పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఉషారాణిని పరామర్శించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి - నెల్లూరు ఏపీ టూరిజం హోటల్ కార్యాలయం వార్తలు
నెల్లూరు ఏపీ టూరిజం హోటల్ కార్యాలయంలో దివ్యాంగ మహిళా ఉద్యోగిపై జరిగిన దాడి బాధాకరమని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పట్టణంలోని టూరిజం హోటల్‌కి వెళ్లి బాధిత మహిళ ఉషారాణిని ఆయన పరామర్శించారు.
ఉషారాణిని పరామర్శించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి
ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరామన్నారు. దాడికి పాల్పడిన భాస్కర్‌ను సస్పెండ్ చేయడం కాకుండా, డిస్మిస్ చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు.
ఇదీ చూడండి.కరోనాతో కుమారుడు... కలతతో తండ్రి మృతి... అంత్యక్రియలు చేసింది ఖాఖీ.!