ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి - వెంకటాచలంలో ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. వివిధ గ్రామాల్లో వర్షాల ధాటికి నష్టపోయిన పంటలను పరిశీలించి.. రైతులకు ధైర్యం చెప్పారు. ప్రతి అన్నదాతను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

mla kakani govardhan reddy
నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి

By

Published : Dec 5, 2020, 7:17 PM IST

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో నివర్ తుపాను ధాటికి నష్టపోయిన పంటలను ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. పూడిపర్తి, ఈదగాలి, జంగాలపల్లి గ్రామాల్లో అధికారులతో కలిసి బాధిత రైతులతో మాట్లాడారు.

తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రభుత్వం 80 శాతం రాయితీతో వరి విత్తనాలు రైతులకు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details