తెదేపా నేత సోమిరెడ్డి సత్తా ఏంటో 2024 ఎన్నికల్లో తేల్చుకుంటామని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ఆనందయ్య మందు వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలను కాకాణి ఖండించారు. సోమిరెడ్డి చెప్పినట్లు.. సెశ్రిత కంపెనీ ఎవరిదో తమకు తెలియదన్న కాకాణి, ఈ అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆస్తులు పంచుకున్నప్పుడు వచ్చిన ఆస్తి ఎంత.. ఇప్పుడెంత? మిగిలిందో చెప్పాలని సోమిరెడ్డికి సవాల్ విసిరారు.
Kakani counter: సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే కాకాణి - MLA kakani govardhan reddy fire on TDP leader somireddy
తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య మందు వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణలపై స్పందించిన కాకాణి.. సోమిరెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎవరి సత్తా ఏంటో 2004 ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
kakani