ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అభివృద్ధిని ఓర్వలేకే విమర్శలు: ఎమ్మెల్యే కాకాని - mla kakani press meet news

ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ఓ ఉద్యమంలా చేపట్టిందని నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. జగన్ అందిస్తోన్న సంక్షేమ పాలనను ఓర్వలేకే తెదేపా లేనిపోని విమర్శలు చేస్తోందని ఆయన విమర్శించారు.

mla kakanmla kakanii
mla kakani

By

Published : Jun 6, 2021, 8:47 PM IST

రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించిందని.. మొదటి విడతలో 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో 1.90 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్లు చెప్పారు. అన్ని మౌలిక వసతులతో కాలనీల నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తుంటే.. ఓర్వలేక తెదేపా లేనిపోని విమర్శలు చేస్తోందని దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details