ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్​రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..ఏమన్నారంటే..! - nellor mla prasannakumar reddy

తెలుగుదేశం మద్దతుతో గెలిచిన సర్పంచులకు పనులు చేయొద్దని నె‌ల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధికారులకు హుకుం జారీ చేశారు. పల్లెపాడు సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఓడిన వైకాపా నాయకుడు కుమార్‌ చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.

ప్రసన్న కుమార్ రెడ్డి
ప్రసన్న కుమార్ రెడ్డి

By

Published : Aug 7, 2021, 8:40 PM IST

నె‌ల్లూరు జిల్లా కోవూరు వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం మద్దతుతో గెలిచిన సర్పంచులకు పనులు చేసిపెట్టొద్దని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అధికారులకు హుకుం జారీ చేశారు. ఇందుకూరుపేట మండలం పల్లెపాడు డైట్ కళాశాలలో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే.. నాలుగు గ్రామాల్లో వైకాపాను ఎందుకు ఓడించారని ప్రశ్నించారు.

ప్రసన్న కుమార్ రెడ్డి

పల్లెపాడు సర్పంచ్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వైకాపా నాయకుడు కుమార్‌ చెప్పిన వారికే పనులు చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. సమావేశంలో ఒకింత ఆవేదన వ్యక్తం చేసిన ఆయన... మండలంలోని పల్లెపాడు, పున్నూరు, కొత్తూరు, డేవిస్ పేట నాలుగు పంచాయితీల్లో తెదేపా మద్దతుదారులు గెలిచారని.... వైకాను ఓడించారని తెలిపారు. ఎన్నో అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఓడించారని నల్లపురెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

స్వర్ణం గెల్చినందుకు రూ. 6 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగం

ABOUT THE AUTHOR

...view details