సీఎం జగన్ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన చేస్తూ ప్రతి ఒక్కరి చేత శభాష్ అనిపించుకుంటున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాలకు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 108, 104 వాహనాలను బస్టాండ్ కూడలిలో వైకాపా నాయకులు, అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తండ్రికి మించిన తనయుడిగా పరిపాలన చేస్తూ ప్రజల ఆదరణ పొందురన్నారని కొనియాడారు. పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న చరిత్ర దేశంలో మరే ముఖ్యమంత్రికి లేదన్న ఆయన... వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక తేదేపా వారు అర్థరహితమైన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.
ఉదయగిరిలో 108,104 వాహనాలు ప్రారంభించి ఎమ్మెల్యే - ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ తాజా వార్తలు
ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రతి మాటను అమలు చేస్తూ ప్రజల మెచ్చేలా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో 108, 104 వాహనాలను వైకాపా నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు.
ఉదయగిరిలో 108,104 వాహనాలు ప్రారంభించి ఎమ్మెల్యే