ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ సారి పాజిటివ్.. ఆ వెంటనే నెగెటివ్.. ఏంటీ నిర్లక్ష్యం?

ఓ వైపు కరోనా వ్యాప్తి... ప్రపంచాన్ని వణికిస్తుంటే ఆ వైరస్ పరీక్షల ఫలితాలు మాత్రం వెంట వెంటనే ఒకసారి పాజిటివ్, మరోసారి నెగెటివ్ వస్తుండడం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు అత్యవసరంగా మరోసారి పరీక్ష నిర్వహించినా.. ఆ నివేదిక ఆలస్యంగా రావడంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Anger on corona tests  at nellore
నెల్లూరులో కరోనా నిర్ధరణ పరీక్షల్లో తేడా

By

Published : Apr 6, 2020, 3:59 PM IST

రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ... ఓ జిల్లాలో కరోనా నిర్ధరణ ఫలితాలు ఒకేసారి రెండు విధాలుగా వచ్చాయి. ఓ మత పెద్దకు నిర్వహించిన పరీక్షల్లో మొదట పాజిటివ్​గా, వెంటనే నెగటివ్​గా రావడం చర్చనీయాంశమైంది. దీంతో అధికారులు అత్యవసరంగా మరోసారి పరీక్ష నిర్వహించినా.. ఆ నివేదిక ఆలస్యంగా వచ్చింది. ఈ పరిణామంపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా పరిషత్ కార్యాలయంలో కరోనాపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రత్యేక అధికారి రాంగోపాల్, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు అధికారులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది.

సదస్సు ముగించుకుని వెళుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే అధికారుల తీరును తప్పుబట్టారు. రెండోసారి నెగటివ్ గా వచ్చినా... నివేదిక తెప్పించడంలో ఆలస్యమైందని, క్వారంటైన్ లోనూ సరైన వసతులు లేవని మంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకువెళ్లారు. ఆ మతపెద్దకు కరోనా నెగిటివ్​గా వచ్చిందని కలెక్టర్ వివరించారు. కుటుంబ సభ్యుల సహకారంతో క్వారంటైన్ లో ఉంచి పరిశీలిస్తున్నామన్నారు. నెల్లూరు నగరం పొగతోట ప్రాంతానికి చెందిన డాక్టర్ కు కరోనా సోకగా అతని పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్ చెప్పారు. మెరుగైన చికిత్స కోసం ఆ వైద్యుడిని చెన్నైకి తరలిస్తున్నట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details