నెల్లూరు జిల్లా అలిమిలి సమీపంలోని కనుమరాయి కొండపైన తితిదే నిధులతో నిర్మిస్తున్న నరసింహ స్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సందర్శించారు. తొలుత ఆలయంలో మెుక్కులు తీర్చుకున్న ఆనం.. దేవస్థానం చరిత్రను తెలుసుకున్నారు. తితిదే కేటాయించిన 50 లక్షల నిధులతో చేపట్టిన పనులను పరిశీలించారు. అనంతరం పలు గ్రామాల్లో పర్యటించి గ్రామ సచివాలయ భవనాలు, అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
తితిదే నిధులతో నిర్మిస్తున్న ఆలయాన్ని పరిశీలించిన ఆనం - ఎమ్మెల్యే ఆనం న్యూస్
తితిదే నిధులతో నెల్లూరు జిల్లా అలిమిలిలో నిర్మిస్తున్న నరసింహస్వామి ఆలయాన్ని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి సందర్శించారు. స్వామి వారిని దర్శించుకొని ఆలయ పనుల పురోగతిపై ఆరా తీశారు.
![తితిదే నిధులతో నిర్మిస్తున్న ఆలయాన్ని పరిశీలించిన ఆనం ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6006513-253-6006513-1581178408021.jpg)
ఆలయాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఆనం