ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2020, 6:35 PM IST

ETV Bharat / state

ఇళ్ల స్థలాల అర్హుల జాబితాపై ఆనం రామనారాయణ సమీక్ష

నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షించారు. నియోజకవర్గంలో 7690 మంది లబ్ధిదారులను గుర్తించామన్న ఆయన... పంపిణీకి ప్రభుత్వ స్థలాన్ని సేకరించామన్నారు. వెంకటగిరి పట్టణ వాసుల దాహార్తిని తీర్చడానికి ప్రభుత్వానికి ఓ నివేదిక పంపామన్నారు. ఆ నిధులు రాగానే తాగునీటి పైపులైన్లు ఆధునీకరిస్తామన్నారు.

ఆనం రామనారాయణ
ఆనం రామనారాయణ

నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని స్పందన కార్యాలయంలో ఇళ్ల స్థలాల లబ్ధిదారుల జాబితాలపై ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో 7690 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నామని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. పట్టణ పరిధిలోని 1923 మంది పేదలకు స్థలాలు కేటాయించడానికి 67 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలాన్ని సేకరించి లే అవుట్ వేశామన్నారు.

టిడ్కోలో కట్టిన గృహాలను సైతం వచ్చే నెల 8న లబ్ధిదారులకు అందించే ప్రక్రియ చేస్తున్నట్లు వివరించారు. వెంకటగిరి పట్టణానికి శాశ్వత తాగునీటి సదుపాయంగా మరో సమ్మర్ స్టోరేజ్ నిర్మిస్తామన్నారు. ప్రజల దాహార్తిని తీర్చడానికి 99 కోట్ల 14 లక్షల రూపాయల అంచనాలతో ప్రభుత్వానికి నివేదించామన్నారు. ఈ నిధులు వస్తే పట్టణంలో తాగునీటి పైపులైన్లు ఆధునికీకరణ చర్యలు చేపడతామన్నారు. అంతకుముందు ఆయన డక్కిలిలో స్పందన కార్యక్రమానికి హాజరై ప్రజల నుంచి వినతులను తీసుకున్నారు.

ఇదీ చదవండి :శాసన మండలి ఛైర్మన్​ షరీఫ్​కు వైకాపా లేఖ

ABOUT THE AUTHOR

...view details