నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలానికి 38 కోట్ల 36 లక్షల విలువైన అభివృద్ధి పనులు మంజూరైనట్లు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. శుక్రవారం బాలాయపల్లి, పిగిలాం, ఉట్లపల్లి గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. మండలంలోని గ్రామ సచివాలయాలన్నింటికీ శాశ్వత భవనాలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు బాలాయపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లల సంఖ్యను పెంచకపోతే ఈ కేంద్రాన్ని తొలగిస్తామని హెచ్చరించారు. ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే... గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
బాలాయపల్లి మండలంలో 38 కోట్లతో అభివృద్ధి పనులు - బాలాయపల్లి మండలం వార్తలు
అన్ని గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
mla anam ramanarayana reddy