ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Corona Rakshak Scam: కరోనా రాకున్నా సర్టిఫికెట్లు సృష్టించి.. డబ్బులు నొక్కేసి - Rakshak Scheme Funds

Corona Rakshak Scheme: కేంద్ర ప్రవేశపెట్టిన కరోనా రక్షక్ స్కీంను నెల్లూరు జిల్లాలోని ఇందుకూరుపేటలో గల వాలంటీర్, గ్రామ సచివాలయంలోని మహిళా పోలీసు కలిసి దుర్వినియోగం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించి 20 లక్షలు కాజేసినట్లు వైసీపీ నేత ఆరోపించారు. ఇందుకు సంబందించి జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విచారిస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు.

Etv Bharat
Etv Bharat

By

Published : May 7, 2023, 5:44 PM IST

Corona Rakshak Scheme Funds: కరోనా సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కరోనా రక్షక్ పేరుతో జరిగిన అక్రమాలపై వైసీపీ నేతగునపాటి సురేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అక్రమాలకు పాల్పడ్డ సచివాలయానికి చెందిన మహిళా పోలీసుతో పాటుగా, గ్రామ వాలంటీర్​పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీకి ఫీర్యాదుచేసినట్లు వెల్లడించారు. అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది.

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో కరోనా పరిహారం పక్కదారి పట్టింది. కరోనా రక్షక్ పాలసీ కింద బాధితులకు కేంద్ర ప్రభుత్వం అందించిన రెండు లక్షల రూపాయల పరిహారాన్ని కొందరు కాజేశారు. ప్రస్తుతం 20లక్షల రూపాయల పరిహారం పక్కదారి పట్టినట్లు బయటపడింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ కుంభకోణాన్ని మండల వైసీపీ నేత గునపాటి సురేష్ రెడ్డి.. స్వయంగా ఆధారాలతో సహా బయటపెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పక్కదారి పట్టిన 20 లక్షల పరిహారం: గునపాటి సురేష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఇందుకూరుపేట సచివాలయం-వన్​లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్, హోంగార్డు, వాలంటీర్ల సహకారంతో ఈ పరిహారాన్ని సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్లు గునపాటి సురేష్ రెడ్డి ఆరోపించారు. కరోనా రక్షక్ పాలసీ పేరుతో కేంద్రం కరోనా బాధితులకు రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసింది. ఇందుకూరుపేట సచివాలయం పరిధిలో కరోనా రాకున్నా కొందరి పేర్లతో నకిలీ సర్టిఫికెట్లతో తయారుచేసి పరిహారానికి దరఖాస్తు చేశారు. కరోనా బాధితులకు ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సహాయాన్ని మహిళా కానిస్టేబుల్, వాలంటీర్, హోంగార్డు తమ ఖాతాకు మళ్లించుకున్నారని సురేష్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం పరిహారం విడుదలైన బాధితులకు ఐయిదు వేలు, వాలంటీర్లకు అయిదు వేలు అందజేసి.. మిగిలిన మొత్తం వీరు కాజేశారని చెప్పారు. ప్రస్తుతం పది మందికి సంబంధించిన రూ.20 లక్షల పరిహారం పక్కదారి పట్టినట్లు తెలిసిందన్నారు. ఉన్నతాధికారులు విచారిస్తే భారీ కుంభకోణం బయట పడుతుందన్నారు.

నెల్లూరు జిల్లాలో కరోనా రక్షక్ నిధుల దుర్వినియోగం

'గవర్నమెంట్ ప్రవేశ పెట్టిన కరోనా రక్షక్ స్కీంను దుర్వినియోగం చేసిన వారిపై కలెక్టర్, ఎస్పీకి ఫర్యాదు చేశాను . వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాను. కరోనా టైంలో ''కరోనా రక్షక్'' పేరుతో కేంద్రం ఇన్సూరెన్స్ స్కీంను తీసుకు వచ్చింది. ఈ స్కీంను కొందరు దుర్వినియోగం చేశారు. ఇందుకూరుపేట సచ్చివాలయంలో పని చేస్తున్న మహిళా పోలీసుతో పాటుగా గ్రామ వాలంటీర్, హోంగార్డు కలిసి అక్రమాలకు పాల్పడ్డారు. ఈ అంశం ఆ వాలంటీర్ వాళ్ల అక్క ప్రచారం చేయడంతో వెలుగులోకి వచ్చింది.'- గునపాటి సురేష్ రెడ్డి, వైసీపీ నేత

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details