ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వచ్చే ఏడాదిలో సంగం, పెన్నా బ్యారేజీల నిర్మాణం పూర్తి' - సంగం బ్యారేజీ

నెల్లూరు జిల్లాలోని నీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తామని... మంత్రులు అనిల్​ కుమార్​ యాదవ్, మేకపాటి గౌతమ్ రెడ్డి​ వివరించారు. వచ్చే ఏడాదిలోనే సంగం, పెన్నా బ్యారేజీలను పూర్తి చేస్తామని వెల్లడించారు.

Ministers inspected the sangam Barrage
సంగం ప్రాజెెక్టును పరిశీలిస్తున్న నేతలు

By

Published : Dec 26, 2019, 5:37 PM IST

మంత్రి అనిల్​ కుమార్ యాదవ్ ప్రసంగం

నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని... రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్​ కుమార్ యాదవ్ వెల్లడించారు. నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాజీఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో కలిసి సంగం బ్యారేజీ నిర్మాణ పనులను ఐటీ, ఇరిగేషన్ శాఖ మంత్రులు మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ పరిశీంచారు.

ఈ సందర్భంగా గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ... సంగం బ్యారేజి నిర్మాణ పనులపై గత ప్రభుత్వం శీతకన్ను వేసిందని విమర్శించారు. అతి త్వరలో ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి సాగు, తాగునీరు అందిస్తామని వెల్లడించారు. టూరిజం కేంద్రంగానూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. మంత్రి అనిల్​కుమార్ యాదవ్ మాట్లాడుతూ... మే లోపు పెన్నా బ్యారేజీ పనులను... అక్టోబర్​లోపు సంగం బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తిచేసి ముఖ్యమంత్రి జగన్​ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. సోమశిల హైలెవల్ కెనాల్ పనులనూ వేగవంతంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:మతిస్థిమితం లేని జంటకు పెళ్లి.. సైకిల్​పై ఊరేగింపు

ABOUT THE AUTHOR

...view details