నెల్లూరు జిల్లా కృష్ణపట్నం నోడ్(krishnapatnam node)లో 11 వేల ఎకరాలకు పర్యావరణ అనుమతులు వచ్చాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. నెల్లూరులో నిర్మిస్తున్న బీసీ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. బీసీలకు ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తూ... సంక్షేమపరంగా, రాజకీయంగా వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నారని మంత్రి అనిల్ తెలిపారు. ఏడాదిలోగా బీసీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు.
'రాష్ట్రంలో బీసీల అభివృద్ధికి పెద్దపీట' - Ministers goutham reddy
నెల్లూరులో బీసీ భవన్(BC Bhavan) శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు గౌతమ్ రెడ్డి(Minister goutham reddy), అనిల్ కుమార్ యాదవ్(anil kumar yadav) పాల్గొన్నారు. బీసీలకు జగన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటోందన్న మంత్రులు.. ఏడాదిలోగా బీసీ భవన్ నిర్మాణాన్ని పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
నెల్లూరులో బీసీ భవన్ శంకుస్థాపన కార్యక్రమం