ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఫోన్ ట్యాపింగ్ కాదు.. మ్యాన్ ట్యాపింగ్' - nellore political news

Minister Meruga Nagarju: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, మేరుగు నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్​ను ఎప్పట్నుంచో ట్యాపింగ్ చేస్తున్నారన్న కోటంరెడ్డి, ఇంతకాలం ఆగి.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కాదు మ్యాన్ ట్యాపింగ్ అని మంత్రులు విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై మాట్లాడే స్థాయి కోటంరెడ్డికి లేదని ఎద్దేవా చేశారు.

MLA Kotamreddy Sridhar Reddy
Minister Meruga Nagarju

By

Published : Feb 3, 2023, 4:09 PM IST

Minister Kakani Govardhan Reddy: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలపై మంత్రులు కాకాణి గోవర్దన్ రెడ్డి, మేరుగు నాగార్జున స్పందించారు. 'ఫోన్ ట్యాపింగ్ కాదు మ్యాన్ ట్యాపింగ్' అని మంత్రులు విమర్శించారు. సజ్జల రామకృష్ణారెడ్డిపై మాట్లాడే స్థాయి కోటంరెడ్డికి లేదని ఎద్దేవా చేశారు.

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి

మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి: జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి మాట్లాడారు. ప్రభుత్వంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న విమర్శలును తోసిపుచ్చారు. శ్రీధర్ రెడ్డి చెప్పినట్టు అది ఫోన్ ట్యాపింగ్ కాదు మ్యాన్ ట్యాపింగ్ అని అన్నారు. చంద్రబాబు నాయుడు బుట్టలో పడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని, ఫోన్ ట్యాపింగ్​పై కోర్టుకు వెళ్లు.. లేకుంటే చట్ట ప్రకారం ఏదైనా చేయి.. అంతేకానీ ఇలా పార్టీపై బురద చల్లవద్దని కోరారు. గ్రామీణ నియోజకవర్గంలో ఇసుక, మద్యంపై నువ్వు కోరిన విధంగా విచారణ చేయిద్దామని అన్నారు.

మంత్రి మేరుగ నాగార్జు: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఊసరవెల్లిలా రంగులు మార్చి మాట్లాడుతున్నారని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. చంద్రబాబు వలలో పడి కోటంరెడ్డి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. తన ఫోన్​ను ఎప్పట్నుంచో ట్యాపింగ్ చేస్తున్నారన్న కోటంరెడ్డి, ఇంతకాలం ఆగి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కోటంరెడ్డి తెగబడి మాట్లాడుతున్నారని తెలిపారు.

సజ్జల భార్గవ్​కు సోషల్ మీడియా ఇన్​చార్జి: సజ్జల రామకృష్ణారెడ్డిపై మాట్లాడే స్థాయి కోటంరెడ్డికి లేదన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేశారు కాబట్టే సజ్జల భార్గవ్​కు సోషల్ మీడియా ఇన్​చార్జి పదవి ఇచ్చారన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదు.. ఫోన్ ట్యాపింగ్​పై ఆధారాలు ఉంటే కోటంరెడ్డి బయట పెట్టాలన్నారు. జగన్ లేకపోతే ఎమ్మెల్యే కోటంరెడ్డి జీరో అని అన్నారు. కోటంరెడ్డి ఫోన్ రికార్డింగ్ జరిగిందన్న మంత్రి.. అవసరమొచ్చినపుడు అన్ని ఆధారాలు బయటపెడతామన్నారు. కోటంరెడ్డి ఎమ్మెల్యే పదవిపై చర్యలు తీసుకునే విషయంలో అవసరాన్ని బట్టి ముందుకెళతామన్నారు.

'ప్రభుత్వంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేస్తున్న విమర్శలు పూర్తిగా అవాస్తవాలు. శ్రీధర్ రెడ్డిని జగన్ అందరికన్నా ఎక్కువగా నమ్మాడు. కేవలం ఆరోపణలు చేయాలని మాత్రమే చేస్తున్నారు. చెప్పినట్టు అది ఫోన్ ట్యాపింగ్ కాదు మ్యాన్ ట్యాపింగ్. చంద్రబాబు నాయుడు బుట్టలో పడి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడు. ఫోన్ ట్యాపింగ్​పై కోర్టుకు వెళ్లు, లేకుంటే చట్ట ప్రకారం ఏదైనా చేయి. అంతేకానీ ఇలా పార్టీపై బురద చల్లవద్దు. గ్రామీణ నియోజకవర్గంలో ఇసుక, మద్యంపై నువ్వు కోరిన విధంగా విచారణ చేయిద్దాం.' -కాకాణి గోవర్ధన్ రెడ్డి, వ్యవసాయ శాఖా మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details