ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెడ్​జోన్ ప్రాంతాల్లో మంత్రి పర్యటన - రెడ్​జోన్ ప్రాంతాల్లో మంత్రి పర్యటన

కరోనా వైరస్ కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతమైందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని రెడ్​జోన్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు.

రెడ్​జోన్ ప్రాంతాల్లో మంత్రి పర్యటన
రెడ్​జోన్ ప్రాంతాల్లో మంత్రి పర్యటన

By

Published : May 31, 2020, 4:03 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని రెడ్​జోన్ గ్రామాల్లో మంత్రి గౌతమ్ రెడ్డి పర్యటించారు. అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి చేరుకొని డాక్టర్లతో కాసేపు ముచ్చటించారు. అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలను పంపిణీ చేశారు.

కరోనా టెస్టు కిట్ల ద్వారా వైరస్ సోకిన వారిని గుర్తించి రాష్ట్రంలో కట్టడి చేయగలిగామన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి కిట్లు లేకపోవడం వల్ల కరోనా నియంత్రణలో ఆయా రాష్ట్రాలు విఫలమయ్యాయని వివరించారు. ఇప్పుడు అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయని మంత్రి వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details