నెల్లూరులో మంత్రి నారాయణ పర్యటన నెల్లూరు నగరాన్ని రూ. 5,200 కోట్లతో అభివృద్ధి చేశామని... మళ్లీ తాము అధికారం చేపడితే మరో 5 వేల కోట్లతో అభివృద్ధి చేస్తామని నెల్లూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, మంత్రి నారాయణ వెల్లడించారు. గత 71ఏళ్లల్లో ఎన్నడూ జరగని అభివృద్ధి ఈ నాలుగున్నరేళ్లలోచేశామన్నారు. నగరంలోని వి.బి.ఎస్. కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మంత్రి నారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు మరోసారి ఎమ్మెల్సీ ఇచ్చి... మంత్రి పదవి ఇస్తానని చెప్పారని... ప్రజా తీర్పు కోసం ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు.