కార్తికమాసం పూజల్లో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. - karthikamasam 2020
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్లలో కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పాల్గొని దీపాలు వెలిగించారు.
![కార్తికమాసం పూజల్లో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి.. Minister Mekapati Gautamreddy worships on the last Monday of Kartikam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9882030-769-9882030-1608004584917.jpg)
కార్తికమాసంలో చివరి సోమవారం.. మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పూజలు
కార్తిక పౌర్ణమి చివరి సోమవారం వేడుకల్లో మంత్రి గౌతంరెడ్డి పాల్గొని దీపాలు వెలిగించారు. నెల్లూరు జిల్లా తన సొంత నియోజకవర్గమైన ఆత్మకూరు చేజర్ల మండలంలో అతి పురాతనమైన శైవ క్షేత్రం కోటితీర్థం శివాలయం వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిని గ్రామస్తులు ఘనంగా మేళతాళాలతో స్వాగతం పలికారు. మంత్రితో పాటు స్థానిక పార్టీ నేతలతో పాటు గ్రామ ప్రజలందరూ కార్తిక మాసం చివరి సోమవారం కావటంతో వేడుకలు నిర్వహించారు.