AP Minister Kakani Govardhan Reddy latest comments: నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన జీవన సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల భవనాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం రాష్ట్రంలో రూ. 10వేల 778 రైతు భరోసా కేంద్రాల్ని ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అందులో రూ.3వేల పై చిలుకు శాశ్వత భవనాలున్నాయని వెల్లడించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కాకాణి వ్యాఖ్యానించారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరు నగరంలో రెండు కోట్ల 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జీవన సేంద్రియ ఎరువుల నాణ్యత నిర్ధారణ ప్రయోగశాల భవనాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులకు సలహాలు సూచనలు సేవలు అందించేందుకు 10,778 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో 3 వేల పైచిలుకు శాశ్వత రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశామన్న ఆయన.. 4 వేల రైసు రైతు భరోసా కేంద్ర భవనాలను ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారని మంత్రి వ్యాఖ్యానించారు.