నెల్లూరు జిల్లాలో లాక్డౌన్ కారణంగా పొగాకు కొనుగోళ్లు నిలిచిపోయాయి. పొగకు రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి స్పందించి మర్రిపాడు, కలిగిరి పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నుంచి వేలం ప్రారంభించేాలా ఏర్పాటు చేయించారు. పొగాకు రోజురోజుకూ రంగు మారి పోయి పాడైపోతుందని రైతులు తమ గోడు చెప్పుకోగా..మంత్రి టొబాకో బోర్డు అధికారులతో చర్చించారు.
జిల్లా కలెక్టర్ కు పొగాకు కొనుగోళ్లను ప్రారంభించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ఎం.వీ శేషగిరి బాబు జిల్లాలోని పొగాకు కొనుగోలు కేంద్రాలైన, డీసీ పల్లి, కలిగిరిలో కొనుగోళ్లు మే 11వ తేదీ నుంచి ప్రారంభించాలని మార్గదర్శకాలిచ్చారు.