గతంలో నీటి సరఫరాకు సంబంధించిన బిల్లులు రాలేదన్న ఫిర్యాదుపై మంత్రి మేకపాటి గౌతంరెడ్డి స్పందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని హామీఇచ్చారు. చేజర్ల మండలంలో ధాన్యం కొనుగోలు వేగం పుంజుకోవడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి సమస్య ఉండకుండా చూడాలని పునరుద్ఘాటించారు. చేజర్ల మండలంలోని పాడేరులో పథకాల అమలు తీరుపై మంత్రి ఆరాతీశారు. పింఛన్, ఇళ్ల పట్టాలు, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా వంటి సంక్షేమ పథకాలకు అర్హత ఉండి రానివారి జాబితా సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
సోమశిల నుంచి స్థానిక 'చిన్న చెరువు'కు నీరందించడానికి ప్రతిపాదన సిద్ధం చేయాలని జలవనరులశాఖ సహాయ ఇంజినీర్‌ను ఆదేశించారు. గొల్లపల్లిలో సిమెంట్ రోడ్లు, కాల్వల పనులు, మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. తూర్పుపల్లి ఉన్నత పాఠశాల భవనాన్ని పునఃనిర్మించాలని ఆదేశించారు.
ఆత్మకూరు అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పనిచేసే వివిధ శాఖల అధికారులతో మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాని అధికారులను ఆదేశించారు.
ఆత్మకూరు అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్
ఇదీ చదవండీ... విశాఖలో మాజీ ఎంపీ సబ్బంహరి ఇంటి దగ్గర ఉద్రిక్తత