సంక్షేమ పథకాలతోనే భారీ మెజార్టీ: మంత్రి గౌతమ్ రెడ్డి - పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి
మున్సిపాలిటీ ఎన్నికల్లో వైకాపా విజయం పట్ల పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. పార్టీని గెలిపించిన కార్యకర్తలను ఆయన అభినందించారు.
రాష్ట్రంలోని 75 మున్సిపాలిటీల్లో 74 మున్సిపాలిటీలను వైకాపా గెలవడం ఎంతో ఆనందంగా ఉందని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నెల్లూరులో అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందజేసిన చేసిన సంక్షేమ పథకాల వల్లే ఇంత మెజార్టీ వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి.. ప్రజల కోసం ఎంతో కష్టపడ్డారని గుర్తు చేసిన ఆయన.. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని ప్రజలకు అందించేందుకు ఇంకా కృషి చేస్తామన్నారు. వైకాపాను ఈ స్థాయిలో గెలిపించిన కార్యకర్తలను మంత్రి అభినందించారు.