నెల్లూరు జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని చెక్ పోస్టులను మంత్రి గౌతంరెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. నెల్లూరు నుంచి బయల్దేరి సంగం, ఆత్మకూరు, మర్రిపాడు మీదుగా సరిహద్దు వద్దకు చేరుకుని భద్రతను పరిశీలించారు. పోలీసులకు, అధికారులకు పలు సూచనలు చేశారు. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలని.. బయట ప్రాంతాల నుంచి వ్యక్తులు జిల్లాలోకి రాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట పోలీస్, రెవెన్యూ అధికారులు ఉన్నారు.
'బయటివారిని రానివ్వకండి.. కఠిన చర్యలు తీసుకోండి' - కరోనా నేపథ్యంలో నెల్లూరులో మంత్రి గౌతంరెడ్డి పర్యటన
జిల్లాలోకి బయటి వ్యక్తుల్ని రానివ్వొద్దని.. లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేయాలని.. నెల్లూరు జిల్లా అధికారులను మంత్రి గౌతంరెడ్డి ఆదేశించారు. సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేశారు.
నెల్లూరులో సరిహద్దు చెక్ పోస్టులను తనిఖీ చేసిన మంత్రి గౌతంరెడ్డి