నివర్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు జిల్లా అధికారులకు మంత్రి గౌతమ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ప్రాణ, ఆస్తి నష్టం నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని లోతట్టు ప్రాంతాల్లో ముందస్తుగా పంపి ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిందిగా చూడాలన్నారు. తాగునీరు, కరెంటు, శానిటేషన్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల పరిస్థితులపై ఇరిగేషన్ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.
నివర్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి: మంత్రి గౌతమ్ రెడ్డి - మంత్రి గౌతమ్ రెడ్డి తాజా వార్తలు
నివర్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలు, తీర ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
నివర్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండండి