నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి స్పష్టం చేశారు. అన్నిశాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులకు ఆయన సూచించారు. నియోజకవర్గంలో వివిధ శాఖల ద్వారా 150 కోట్లతో చేపడుతున్న పనులపై చర్చించారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష - ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష