Minister Dharmana Directions to Volunteers: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు వాలంటీర్లు బాటలు వేయాలంటూ రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మార్గదర్శనం చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో గురువారం వాలంటీర్లు, గృహసారథులు, వైసీపీ నాయకులు, MLA మేకపాటి విక్రమ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి మంత్రి ధర్మాన అంతర్గత సమావేశం నిర్వహించారు. వాలంటీర్లు, నాయకులంతా ఫోన్‌లు స్విచ్ఛాప్ చేసి.. తలుపులు వేసి.. మీడియాకు ప్రవేశం లేకుండా చేసి చర్చించారు.
Dharmana Comments on Infrastructure : రోడ్లు వేయడం ఒక్కటే అభివృద్ధి కాదు : మంత్రి ధర్మాన
Minister Dharmana Meeting With Volunteers: విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఉద్యోగాలిచ్చాం.. గౌరవమైన గుర్తింపు తెచ్చామని సమావేశంలో వాలంటీర్లతో మంత్రి ధర్మాన అన్నట్లు సమాచారం. వైసీపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు వాలంటీర్లు సహకరించాల్సిన అవసరం ఉందని ధర్మాన కోరినట్లు తెలిసింది. తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్లకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తగిన ప్రతిఫలం అందేలా చూస్తారని చెప్పినట్లు సమాచారం. మీరు చేయాల్సిన పనల్లా ఒకటే.. ఆరు నెలల వ్యవధిలో ఇంటింటికీ వెళ్లండి.. ఆయా కుటుంబసభ్యుల మనోభావాలు తెలుసుకోండని వాలంటీర్లకు దిశానిర్దేశం చేశారు. మనకు ఓటేసే వారేనా.. ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉన్నారా.. అనే జాబితా సిద్ధం చేయాలని కోరినట్లు సమాచారం. అది పార్టీ నాయకులకు అందజేస్తే.. మేము వాటిని పైవాళ్లకు పంపుతామని.. వారంతా చేయాల్సింది చేస్తారన్నారు. మీ పనితీరుపై పార్టీ నాయకులు, గృహసారథులతో నిఘా ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలనే లక్ష్యంతో పనిచేయాలని మంత్రి వారికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.
Minister Dharmana జగనన్న ఇస్తున్న పథకాలు అన్నీ ఆగిపోతాయి.. మీకు విజ్ఞత ఉండాలి! : మంత్రి ధర్మాన