2007లో దివంగత నేత, మాజీ మఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పెన్నా బ్యారేజ్ నిర్మాణ పనులు ప్రారంభించారని, కోవూరు, సర్వేపల్లి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోని ఆయకట్టు స్థిరీకరణకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. పెన్నా బ్యారేజ్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్ల ఏర్పాటు కార్యక్రమాన్ని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు.
13 ఏళ్లుగా పెన్నా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ శ్వీకారం చేసిన వెంటనే జిల్లాలోని పెన్నా బ్యారేజ్, సంగం బ్యారేజ్ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తిచేయలని ఆదేశించినట్లు మంత్రి తెలిపారు .డిసెంబరులోనే పెన్నా, సంగం బ్యారేజ్‌లను పూర్తిచేసి, సీఎం చేతుల మీదగా ప్రారంభించాలనుకున్నామని, కానీ, కొవిడ్-19 ప్రభావం, గతంలో ఎన్నడూ లేనంతగా భారీ వర్షాలు కురవడం వలన, నిర్మాణ పనులకు 2 నెలలు ఆటంకం ఏర్పడిందన్నారు.