తాను కొత్తగా ఇల్లు నిర్మించుకున్నానని కొందరు ఏదేదో మాట్లాడుతున్నారని, కానీ తమ తండ్రి సంపాదించిన రూ.కోట్లు విలువ చేసే ఆస్తులు ఇస్కాన్‌సిటీలో అమ్మి ప్రజాసేవ చేస్తున్నానని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్‌కుమార్ యాదవ్ తెలిపారు. శుక్రవారం నెల్లూరులోని సర్వేపల్లి కాలువ ఆధునికీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ తండ్రి నిర్మించిన ఇంటినే కొంత మార్పులు చేశానే తప్ప కొత్తగా నిర్మించలేదని, ఇప్పటికీ కొంతమేర ఆస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
MINISTER ANILKUMAR: ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేస్తున్నా: మంత్రి అనిల్ కుమార్ - minister anil kumar latest news
తన ఆస్తులు అమ్మి ప్రజాసేవ చేస్తున్నానని రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ అన్నారు. కొందరు కావాలనే తనపై బురద జల్లుతున్నారని వ్యాఖ్యానించారు. సర్వేపల్లి ఆధునికీకరణ పనులు (Sarvepalli canal) రూ.85 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేయిస్తుంటే.. వాటిపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు.
సర్వేపల్లి ఆధునికీకరణ పనులు రూ.85 కోట్లతో టెండర్లు పిలిచి పనులు చేయిస్తుంటే వాటిపై ఆరోపణలు చేయడం మంచి పద్ధతి కాదన్నారు. రూ.100 కోట్లతో పెన్నా బ్రిడ్జి టెండర్లు పిలుస్తామని, దమ్ముంటే టెండరు వేసుకోవాలన్నారు. కార్పొరేషన్‌లో అభివృధ్ధి పనులు వస్తున్నాయని, టెండర్లు వేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఆపార్టీ నాయకులు నూనె మల్లికార్జునయాదవ్, వెంకటేశ్వర్లురెడ్డి, శ్రీనివాసులునాయుడు, శివారెడ్డి, ఎస్‌కే సుభాన్, దిలీప్, రవి, షమీమ్ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:RTPP pipeline: నీటి సరఫరా పైపులైన్ లీక్.. ఎగజిమ్ముతున్న నీళ్లు