ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

‘ఏడాదిలో 90 శాతం హామీలు నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానిది’ - MINISTER ANIL VISIT NELLOR

ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం పేద, బడుగు వర్గాల ప్రజలతో పాటు రైతులకూ వైకాపా ప్రభుత్వం చేయూతనందిస్తోందని మంత్రి అనిల్​కుమార్​యాదవ్ అన్నారు. మొదటి ఏడాది 90 శాతం పైగా హామీలు నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

MINISTER ANIL VISIT NELLORE
నెల్లూరులో పర్యటిస్తున్న మంత్రి అనిల్

By

Published : May 22, 2020, 5:02 PM IST

అధికారం చేపట్టిన మొదటి ఏడాది 90 శాతానికి పైగా హామీలు నెరవేర్చిన ఘనత వైకాపా ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్​కుమార్​యాదవ్ అన్నారు. నెల్లూరు నగరం యలమవారిదిన్నె ప్రాంతంలో మంత్రి పర్యటించారు. స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం పేద, బడుగు వర్గాల ప్రజలతో పాటు రైతులకు చేయూతనందిస్తున్నామని మంత్రి అనిల్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తుంటే ప్రతిపక్షాలు అడ్డుతగలడం సమంజసం కాదన్నారు. జూలై 8న ఒకేసారి 27లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. నాడు-నేడు కింద పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details