నెల్లూరు నగరంలోని నవాబుపేటలో ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డును మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నెల్లూరు నగరంలో చిన్న బజార్ ను అధికారులు రెడ్ జోన్ గా ప్రకటించడంతో అక్కడ పండ్ల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారి కష్టాలను గుర్తించిన ప్రభుత్వం.. నవాబుపేట మార్కెట్ యార్డులో పండ్లను నిల్వ ఉంచుకుని, వ్యాపారం చేసుకోవాలని మంత్రి సూచించారు. వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.
నెల్లూరులోని రెడ్జోన్లను పరిశీలించిన మంత్రి అనిల్ - నెల్లూరులో రెడ్ జోన్ ప్రాంతాలు
నెల్లూరు జిల్లా నవాబుపేటలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. రెడ్ జోన్ గా ప్రకటించిన చిన్న బజార్ ను పరిశీలించారు. పండ్ల వ్యాపారులు ఇబ్బంది పడకుండా నవాబుపేట మార్కెట్ యార్డ్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.
minister-anil-visit-nellore