ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మార్కెటింగ్ సొసైటీ స్థలాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం' - 'మార్కెటింగ్ సొసైటీ స్థలాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం'

నెల్లూరు జిల్లా నవాబుపేటలోని మార్కెటింగ్ సొసైటీ రైస్ మిల్లును, రైతు బజారును మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నగరంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామన్నారు.

'మార్కెటింగ్ సొసైటీ స్థలాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం'
'మార్కెటింగ్ సొసైటీ స్థలాన్ని వినియోగంలోకి తీసుకొస్తాం'

By

Published : May 24, 2020, 8:27 PM IST

నెల్లూరు నగరంలోని సహకార మార్కెటింగ్ సొసైటీ స్థలాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడతామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నిరుపయోగంగా ఉన్న ఈ స్థానంలో షాపింగ్ కాంప్లెక్స్ లేదా గోదాములు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

నవాబుపేటలోని మార్కెటింగ్ సొసైటీ రైస్ మిల్లును, రైతు బజారును మంత్రి పరిశీలించారు. మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ వీరి చలపతిరావును అడిగి సమస్యలు తెలుసుకున్న మంత్రి..వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details