నివర్ తుఫాన్ నేపథ్యంలో... తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులతో జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షించి నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ దగ్గర మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెరువు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కోరారు.
నివర్ తుఫాన్‌పై మంత్రి అనిల్ సమీక్ష - నివర్ తుఫాన్ పై మంత్రి అనిల్ సమీక్ష
నివర్ ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తుండటంతో...అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.
నివర్ తుఫాన్‌పై మంత్రి అనిల్ సమీక్ష