దేవినేని ఉమా మాటలు అర్థ రహితం:మంత్రి అనిల్ - ప్రజావేదిక
నిబంధనలకు విరుద్ధంగా కట్టడం వల్లే ప్రజా వేదికను కూల్చివేస్తున్నామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
minister_anil_respond_on_devineni_comments
కక్షపూరిత ధోరణితోనే ప్రజావేదికను కూల్చి వేయించామని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు సరికాదని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. అలాగైతే ముందు చంద్రబాబు నివాసాన్నే పడగొట్టే వాళ్లమని ఆయన జవాబిచ్చారు. ప్రజావేదిక కూల్చివేతపై మాజీ మంత్రి దేవినేని ఉమా మాటలు అర్థరహితమన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అక్రమంగా నిర్మించిన ఇల్లు ఖాళీ చేయాలని సవాల్ విసిరారు.