ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నెల్లూరులో దాదాపు 14 వేల మందికి ఇళ్ల స్థలాలు' - నెల్లూరులో ఇళ్ల స్థలాలపై మంత్రి అనిల్ కామెంట్స్

త్వరలో రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడత కింద 15 లక్షల ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందిస్తున్నట్లు జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరులో దాదాపు 14వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని వెల్లడించారు.

'నెల్లూరులో దాదాపు 14 వేల మందికి ఇళ్ల స్థలాలు'
'నెల్లూరులో దాదాపు 14 వేల మందికి ఇళ్ల స్థలాలు'

By

Published : Dec 22, 2020, 7:02 PM IST

నెల్లూరు నగరంలోని రామచంద్రాపురం, కోదండరామపురం, బాబూ గిరిజన సంఘం ప్రాంతాలలో మంత్రి అనిల్ పర్యటించారు. స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి... వాటిని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు. నెల్లూరులో దాదాపు 14వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. నగరంలో తగినంత స్థలాలు లేకపోవడంతో ఆరు అంకణాల స్థలమే ఇస్తున్నామని చెప్పారు. తాము ఇస్తున్న స్థలాలు రెండు లక్షల విలువ చేస్తాయని, తెదేపా హయాంలో కట్టిన ఇల్లు లక్ష విలువైనా చేస్తాయా అని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details