నెల్లూరు నగరంలో ఉన్న ఆత్మకూరు బస్టాండ్‌ను కోవూరు తరలించేందుకు మంత్రి అనిల్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన కూడలిలో ఉన్న బస్టాండ్‌ను నగరానికి సమీపంలో కోవూరు ప్రాంతంలో అభివృద్ది చేయాలని అధికారులను కోరారు. కోవూరులో మూడు ఎకరాల స్థలం పరిశీలించి అందులో బస్టాండ్‌ను నిర్మించాలని ఆర్టీసీ అధికారులకు ప్రణాళికను వివరించారు. కోవూరు సమీపంలోని చక్కెర పరిశ్రమ స్థలం కూడా అధికారులు పరిశీలనలో ఉంది. మూడు ఎకరాల్లో పెద్ద ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు.
ఆత్మకూరు బస్టాండ్ తరలింపునకు కసరత్తు - miniser anil on athmakur bus stand change
నెల్లూరు జిల్లా ఆత్మకూరు బస్టాండ్‌ను తరలించేందుకు మంత్రి అనిల్‌కుమార్ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో పెద్ద ఆర్టీసీ డిపోను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
![ఆత్మకూరు బస్టాండ్ తరలింపునకు కసరత్తు athamakur bus stand change](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7471793-245-7471793-1591259884072.jpg)
ఆత్మకూరు బస్టాండ్ తరలింపుకు కసరత్తులు