ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్వేపల్లి కాలువ పనులు 5 నెలల్లో పూర్తి చేస్తాం: మంత్రి అనిల్ - సర్వేపల్లి కాలువ అభివృద్ధి కార్యక్రమాలు

నెల్లూరు నగరంలో సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనులను మంత్రి అనిల్ పరిశీలించారు. అయిదు నెలల్లో పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల కారణంగా ఇళ్లు కోల్పోయిన బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

minister anil observed sarvepalli canal development works
minister anil observed sarvepalli canal development works

By

Published : Apr 24, 2021, 2:52 PM IST

నెల్లూరు నగరంలో జరుగుతున్న సర్వేపల్లి కాలువ అభివృద్ధి పనులను 5 నెలల్లో పూర్తిచేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. సర్వేపల్లి కాలవ పరిధిలోని ఆయకట్టుకు నీటి విడుదలను నిలిపేసి, దాదాపు రూ.90 కోట్ల వ్యయంతో యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నగరంలో శెట్టిగుంటరోడ్డు వద్ద జరుగుతున్న కాలువ పనులను మంత్రి పరిశీలించారు.

స్థానికులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పనుల కారణంగా స్థానికంగా నివాసముంటున్న వారికి కొంత ఇబ్బంది జరిగిందని.. వారికి అక్కడే ఇళ్లు కట్టిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇళ్లు తొలగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు రాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. స్థానికులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పనులు పూర్తయిన వెంటనే ఇక్కడే ఇల్లు నిర్మించి పట్టాలు ఇస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details