నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్ పేట వ్యాపార కూడలిలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పర్యటించారు. జిల్లా అధికారులతో కలసి కాలనీలనూ పరిశీలించారు. పెద్ద వ్యాపార కూడలిగా ఉన్న స్టోన్ హౌస్ పేటలో కరోనా కేసులు రావడంతో దుకాణాలు మూసివేశారు. బారికేడ్ల ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలుచేస్తున్నారు. ఆ ప్రాంతాల్లోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. మళ్లీ దుకాణాలు తెరిచే అవకాశాలు ఉన్నాయా? లేదా? అనే విషయాలపై చర్చలు జరిగాయి. కరోనా కట్టడికి పాటించాల్సిన జాగ్రత్తలనూ వివరించారు.
నెల్లూరులో మంత్రి అనిల్‌కుమార్ పర్యటన
నెల్లూరు నగరంలో మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పర్యటించారు. నెల్లూరులోని స్టోన్ హౌస్ పేటలో కరోనా కేసులు రావడంతో బారికేడ్లను ఏర్పాటు చేసి లాక్‌డౌన్‌ను అమలుచేస్తున్నారు.
మంత్రి అనిల్‌కుమార్