ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి అనిల్ కుమార్ - Anil Kumar Yadav visits Housing sites

కల్లూరుపల్లి దగ్గర ఆర్డీటీ సంస్థ పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను మంత్రి అనిల్ కుమార్ పరిశీలించారు. నిర్మాణాలకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలని ఆదేశించారు.

Minister Anil Kumar Yadav
Minister Anil Kumar Yadav

By

Published : Jul 28, 2020, 5:18 PM IST

నెల్లూరు నగరం కల్లూరుపల్లి దగ్గర ఆర్.డి.టి. సంస్థ పేదల కోసం నిర్మిస్తున్న ఇళ్లను రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. నగరంలోని బోడిగాడితోట శ్మశాన వాటిక దగ్గర నివసిస్తున్న నిరుపేదల కోసం ఆర్.డి.టి. సంస్థ ఈ ఇళ్లను నిర్మిస్తోంది. దాదాపు 275 కుటుంబాలకు అన్ని సౌకర్యాలతో ఈ ఇళ్లను అందజేయనున్నారు. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం జరుగుతున్న తీరును రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి మంత్రి పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న ఇళ్ల వివరాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసి అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details