రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని రెడ్ జోన్ ప్రాంతంలో పర్యటించారు. నగరంలోని 47వ డివిజన్ కుక్కలగుంట, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లోని ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం 48వ డివిజన్లో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కాలువ, కల్వర్టు పనులను తనిఖీ చేశారు.
'కంటైన్మెంట్ తీయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తే చెప్పండి' - నెల్లూరు జిల్లాలో కరోనా వార్తలు
నెల్లూరులోని రెడ్‌జోన్ ప్రాంతాల్లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పర్యటించారు. నగరంలోని 48వ డివిజన్లో 60 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న కాలువ, కల్వర్టు పనులను తనిఖీ చేశారు.

Minister Anil Kumar Yadav visited the corona Red Zones in Nellore distict
నిబంధనల ప్రకారం పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కంటైన్మెంట్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పాజిటివ్ కేసు నెగటివ్‌గా మారిన 28 రోజుల తర్వాతే కంటైన్మెంట్ తీస్తారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా వైరస్ నిర్మూలనకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. కంటైన్మెంట్ తీయిస్తామంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. అలాంటి వారిని నమ్మవద్దని సూచించారు.
ఇదీ చదవండి:ఈటీవీ భారత్ గ్రౌండ్ రిపోర్ట్: 'కాలాపానీ'పై రగడ ఏల?