కరోనా నియంత్రణకు ప్రభుత్వం విస్తృతమైన చర్యలు చేపడుతోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. కరోనా నిర్ధరణ పరీక్షలు పెద్ద ఎత్తున నిర్వహిస్తుండటంతో... కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ బాధితులు ఆత్మస్థైర్యంతో ఉంటే కరోనాను జయించవచ్చన్నారు. నెల్లూరులో నగరంలోని పలు ప్రాంతాల్లో పర్యటించిన ఆయన...కరోనా నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం స్టోన్ హౌస్ పేట దగ్గరున్న ఆర్.ఎస్.ఆర్. మున్సిపల్ ఉన్నత పాఠశాలలో 2.50 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.
కరోనా నియంత్రణ చర్యలు ముమ్మరం చేయండి: మంత్రి అనిల్ - నెల్లూరు జిల్లాలో కరోనా కేసులు
వైద్యుల సూచనలు పాటిస్తూ బాధితులు ఆత్మస్థైర్యంతో ఉంటే కరోనాను జయించవచ్చని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు నగరంలో పర్యటించిన ఆయన...పలు ప్రాంతాల్లో కరోనా నియంత్రణ చర్యలను పరిశీలించారు.
minister anil kumar yadav