కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి అనిల్ - కరోనా నివారణపై మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్
కరోనా వ్యాప్తి నివారణపై సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ప్రజలంతా ఇళ్లల్లోనే ఉంటూ కరోనాను అరికట్టాలని సూచించారు.
కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణ పరిస్థితులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కొందరు ఇంట్లో కూర్చుని అసత్య ప్రకటనలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.